ManchuFamily : కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు

  • ముదిరిన మంచు కుటుంబంలో విభేదాలు
  • మోహన్ బాబుపై కేసు పెట్టిన మనోజ్
  • నేడు మనోజ్ ఇంటికి మంచు విష్ణు

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ సారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్‌పై ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

Also Read : Pushpa 2 : పుష్ప -2 లేటెస్ట్ టికెట్ ధరలు ఇవే.!

కాగా ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్ తనపై దాడి చేసాడని మోహన్ బాబు కేసు పెట్టాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతోంది. మంచు ఫ్యామిలీ ఈ వివాదం ముదురుతుంది. ఈ తెల్లవారుజామున జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చాడు. మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లాడు విజయ్. రెండు రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు, ప్రైవేట్ బౌన్సర్ల తో కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని సమాచారం అందుతోంది. గతంలో ఓ సారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు వెళ్లి దాడి చేసిన వీడియోలు హల్ చల్ చేసాయి. ఇక ఇప్పుడు మంచులో రేగిన మంటలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *