ManchuFamily : మంచు మనోజ్ ఇంటిని చుట్టుముట్టిన బౌన్సర్లు

మంచు ఫ్యామిలీ లో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది.  తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్. ఒంటిమీద గాయాలైనట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి  మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు.

Also Read : Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..?

కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ పై దాడి నేపథ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి  హైదారాబాద్ వచ్చాడు. మరికాసేపట్లో జల్ పల్లి లోని మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్ళనున్నాడు విష్ణు. ఈ నేపథ్యంలో జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి  పోటాపోటీగా బౌన్సర్లును దింపారు మంచు మనోజ్, మంచు విష్ణు. ఇప్పటికే  విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. దీంతో పోటీగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ 30 మంది బౌన్సర్లను తెప్పించాడు . మొత్తం 70 మంది బౌన్సర్ల తో మోహన్ బాబు ఇంటి పరిసరాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే విష్ణు బౌన్సర్లను  మోహన్ బాబు ఇంటిలోకి అనుమతించారు కానీ మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు  సెక్యూరిటీ సిబ్బంది. వారంతా మోహన్ బాబు ఇంటి గేట్ బయట వేచిచూస్తున్నారు. కాసేపట్లో  మోహన్ బాబు ఇంటికి విష్ణు రానున్నాడు. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *