మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్. ఈ సినిమా అక్కడ థియేటర్స్ లో హయ్యెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. మంజుమ్మల్ బాయ్స్ ను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. ఇక్కడా మంచి స్పందన వచ్చిందీ సినిమా. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫిల్మ్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇవాళ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మే 5న మంజుమ్మల్ బాయ్స్ పాన్ ఇండియా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ, హిందీలో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. గుణ కేవ్స్ ను చూడటానికి వెళ్లిన మంజుమ్మల్ బాయ్స్ బృందంలో ఒకరు ఆ గుహలో చిక్కుకుపోవడం, అతన్ని మిగతా మిత్రులు ఎలా కాపాడారు అనేది ఈ సర్వైవల్ థ్రిల్లర్ కథాంశం. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, అభిరామ్ తదితరులు కీరోల్స్ ప్లే చేశారు. మలయాళ ఇండస్ట్రీలో 200 కోట్ల రూపాయలు వసూళు చేసిందీ సినిమా.