- హైదరాబాద్: జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
- మంచు మనోజ్ దంపతులను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న బౌన్సర్లు
- గేట్లను తోసుకుని లోపలికి వెళ్లిన మనోజ్ దంపతులు
మంచు మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు హైదరాబాద్ డిజిపి ఆఫీసులో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్, మౌనిక దంపతులు తిరిగి మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. అయితే వాళ్లు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు ఓపెన్ చేయలేదు. దీంతో చాలా సేపు కారులోనే వెయిట్ చేసిన మంచు మనోజ్ దంపతులు చివరికి కారు దిగి బయటకు వచ్చారు. అయితే మంచు మనోజ్ మంచు మనోజ్ తరపు వచ్చిన బౌన్సర్లు చాలాసేపటి తరువాత గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
Manchu Manoj: మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మనోజ్
తన కూతురు లోపల ఉందని అందుకే డోర్ గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళామని మనోజ్ మనోజ్, తరపు బౌన్సర్లు వెల్లడించారు. మంచు మనోజ్ లోపల నా కూతురు ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మంచు మనోజ్ ఎంత మొత్తుకున్నా సరే మోహన్ బాబు ఇంటి వద్ద గేట్లు తెరిచేందుకు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే గేట్లు బద్దలు కొట్టుకుని మంచు మనోజ్ లోపలికి వెళ్లిన క్రమం హాట్ టాపిక్ అవుతుంది.