Published on Dec 30, 2024 10:01 AM IST
కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఐతే, ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణను కించపరుస్తూ కొన్ని సీన్లు తీశారు. దీంతో, మంతెన సత్యనారాయణ అభిమానులు ఈ సినిమా టీమ్ పై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ ఫ్యాన్స్ దాడి చేశారు. ఈ దాడి కలకలం రేపుతోంది.
‘డ్రింకర్ సాయి’ సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా చిత్రయూనిట్ గుంటూరులోని శివ థియేటర్ వద్దకు వెళ్లారు. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి కూడా శివ థియేటర్ వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో సినిమా గురించి మాట్లాడుతూ ఉండగా.. వెనుక నుంచి కొందరు ఆవేశంగా వచ్చి.. మా మంతెన సత్యనారాయణనే కించపరుస్తూ సీన్లు తీస్తావా ? అంటూ డైరెక్టర్ పై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ పై దాడి చేసిన మంతెన సత్యనారాయణ ఫాన్స్
సినిమాలో ఆయన్ను కించపరుస్తూ సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి.
సక్సెస్ టూర్ లో భాగంగా గుంటూరు శివ థియేటర్ లో జరిగిన ఘటన#DrinkerSai pic.twitter.com/JCvLfm0ora
— Milagro Movies (@MilagroMovies) December 29, 2024