తెలుగు రాష్ట్రాల్లో ‘మార్కో’ విధ్వంసం | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 2, 2025 4:00 PM IST

టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే, డబ్బింగ్ సినిమాలకు కూడా యాక్షన్ మూవీ లవర్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందిస్తుంటారు. తాజాగా మలయాళంలో తెరకెక్కిన ‘మార్కో’ మూవీ న్యూ ఇయర్ కానుకగా తెలుగులో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించడం.. టీజర్, ట్రైలర్లలో మాస్ కంటెంట్ ఆకట్టుకునేలా ఉండటంతో ఇక్కడి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి వైలెంట్ మూవీగా మేకర్స్ ప్రమోట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. దీంతో ఈ సినిమాకు రిలీజ్ రోజున మంచి ఆదరణ దక్కిందని చెప్పాలి.

‘మార్కో’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఏకంగా రూ.1.75 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ మలయాళ డబ్బింగ్ సినిమాకు ఇదే అత్యధిక వసూళ్లు అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను హనీఫ్ డైరెక్ట్ చేయగా ఇందులో సిద్ధీఖి, జగదీష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *