- ప్రభాస్ తో ది రాజాసాబ్ చేస్తున్న మారుతి
- నెక్ట్స్ లెవల్ కథ అంటున్న మేకర్స్
- అల్లు అర్జున్ కు కథ రెడీ చేసే పనిలో మారుతి
Director Maruthi : మ్యాచో స్టార్ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసిన మారుతికి.. ఉన్నట్లుండి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా టైం లోనే తన దగ్గర ఉన్న ఐడియాను కథగా మార్చి యూవీ క్రియేషన్స్ వాళ్ల చెవిలో వేశాడు. ఐడియా అదిరిపోయేలా ఉండడంతో ప్రభాస్ కి చెప్పి ఒప్పించారు. ముందు యూవీ బ్యానర్ లోనే ఈ సినిమా అనుకున్నప్పటికీ మధ్యలో పీపుల్ మీడియాకు ఇవ్వాల్సి వచ్చింది. ఆదిపురుష్ లెక్కల కారణంగా ఇలా ప్రాజెక్ట్ చేతులు మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా మారుతితో ప్రభాస్ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వనుంది. మారుతి డైరెక్షన్ లో సినిమా అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. తర్వాత కథ మీద నమ్మకంతోనే ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడని క్లారిటీకి వచ్చారు. ఇక రాజా సాబ్ పోస్టర్స్, మోషన్ పొస్టర్ అంతా సినిమాపై మంచి బజ్ ఏర్పాటు చేశాయి. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు.
Read Also:South Korea: పక్షి ఢీకొనడం, గేర్ ఫెయిల్యూర్, బెల్లీ ల్యాండిగ్.. 179 మందిని బలి తీసుకున్న కారణాలు..
ఐతే రాజా సాబ్ తో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం కచ్చితంగా ఉంది. మరి ఈ సినిమా తర్వాత మారుతి తర్వాత సినిమా ఎవరితో చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కచ్చితంగా స్టార్ హీరోతోనే.. అది కూడా పాన్ ఇండియా లెవల్లోనే ఉంటుందని టాక్. మారుతి ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాజా సాబ్ మీదే పెట్టాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మరో కథకు షిఫ్ట్ అవుతాడు. మారుతి ప్రభాస్ మాత్రం రాజా సాబ్ తో నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందివ్వాలని భావిస్తున్నారు. రాజా సాబ్ హిట్ పడితే స్టార్ హీరోలు కూడా మారుతి తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఐతే మారుతి మాత్రం తన్ బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్ కోసం రెడీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also:Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి రోల్.. ఇప్పటి దాకా ప్రచారం అంతా ఉత్తిదే