Published on Dec 8, 2024 11:59 AM IST
అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర కూడా తాను ఐకాన్ స్టారే అని ‘ ‘పుష్ప 2 ది రూల్’తో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో, ‘పుష్ప 2 ది రూల్’ మొదటి మూడు రోజుల్లోనే $8 మిలియన్ల గ్రాస్ మార్క్‌ను దాటడం నిజంగా విశేషమే. ఈ రోజు ఆదివారం కాబట్టి, ఈ రోజు పూర్తి అయ్యే సమయానికి $10 మిలియన్ల మార్క్ ను కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఒకవేళ నిజంగానే ‘పుష్ప 2 ది రూల్’ మొదటి నాలుగు రోజుల్లోనే $10 మిలియన్ల మార్క్ ను దాటితే మాత్రం అది బన్నీ కెరీర్ లోనే విశేషమైన ఫీట్ అవుతుంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించాడు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్‌లో జగపతి బాబు, సునీల్, అనసూయ మరియు రావు రమేష్ వంటి నటీనటులు నటించారు.
కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.