మాతంగి మీడియ వర్క్స్‌పై ప్రొడక్షన్ నెం 1 ప్రకటన | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 11, 2024 9:15 AM IST

మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక.. ‘దీప విజయలక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘విజయదశమి పర్వదిన సందర్భంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్‌కి దక్కుతాయని భావిస్తున్నాము.’ అని తెలిపారు.

కాగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్టు.. ఈ సినిమాకు టెక్నీకల్ టీం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటినటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాకు వెంకట్ గౌడ్ కథను అందిస్తుండగా, కర్రా నరేంద్ర రెడ్డి డైలాగ్స్ రాస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *