ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మే నెల విషయానికి వస్తే
మే 6: ‘టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూత
మే 8: ప్రముఖ దర్శకుడు సంగీత్ శివన్ (65) అనారోగ్యంతో కన్నుమూత
మే 9: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి 10: పండంటి మగబిడ్డకు
తల్లయిన యామీ గౌతమ్
మే 12: రోడ్డు ప్రమాదంతో టీవీ నటి పవిత్ర జయరామ్ కన్నుమూత
మే 13: తన భార్య, గాయని సైంధవికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్
మే 19: అంగరంగ వైభవంగా లాల్ బహదూర్ స్టేడియంలో డైరెక్టర్స్ డే . జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ కు దర్శకుల సంఘం సత్కారం.
మే 20: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై రైడ్ చేసి తెలుగు నటి హేమ, ఆషి రాయ్ లు పాల్గొన్నారని తేల్చిన పోలీసులు
మే 25: హేమతో సహా రేవ్ పార్టీలో పాల్గొన్న ఏడుగురికి పోలీసుల విచారణకు రమ్మని సమన్లు జారీ