
టాలీవుడ్ ఎప్పుడూ కొత్తతనాన్ని, టాలెంట్‌ను ఆహ్వానించే పరిశ్రమ. అందం, అభినయం ఉన్న హీరోయిన్లు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఎంతో మంది అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. శ్రియ, త్రిష, నయనతార, కాజల్ వంటి హీరోయిన్లు దశాబ్దాల పాటు మెరిసిన వారు. ఇప్పుడు మరో యువ హీరోయిన్ టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్గా మారింది. అభిమానులు ఆమె ఫోటోలను వాల్‌పేపర్‌లుగా పెట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఆమె ఎవరో తెలుసా? 2018లో ఫెమినా మిస్ ఇండియా విజేత, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్ గా నిలిచిన మీనాక్షి చౌదరి. టాలీవుడ్‌లో సుశాంత్ హీరోగా చేసిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందగత్తె, తొలి సినిమాతోనే స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించి మాస్ పాటకు స్టెప్పులేసి కుర్రాళ్లను ఫిదా చేసింది. తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లో నటించి మరింత గుర్తింపు పొందింది.
ఇటీవల, విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలతో పలు సినిమాలకు సైన్ చేసింది. 2024 సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ జోరు చూస్తుంటే మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందనడంలో సందేహమే లేదు!