టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి, ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వరుస విజయాలు – స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు
హిట్ ది సెకండ్ కేస్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు వరుస బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో అదరగొట్టింది.
స్టార్డమ్ పెరుగుతున్న మీనాక్షి – వరుస ఆఫర్లు
ఈ సినిమాల విజయంతో మెహిన్స్ట్రీమ్ హీరోయిన్గా మారిన మీనాక్షి చౌదరి, టాలీవుడ్లో టాప్ లీగ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నట్లు టాక్. టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు మీనాక్షిని తమ ప్రాజెక్ట్స్ కోసం ఎంచుకుంటున్నట్లు సమాచారం.
సోషల్ మీడియాలో హాట్ ఫేవరెట్ – గ్లామర్ షో వైరల్
సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మీనాక్షి, వరుస ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఇటీవల ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్, ఎలిగెన్స్ తో మెరిసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం కుర్రకారును మాయ చేస్తూ, కొత్త సినిమాలకు సిద్ధమవుతోంది.