
టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న నటి మీనాక్షి చౌదరి. 1997 ఫిబ్రవరి 1న హర్యానా రాష్ట్రంలోని పంచకుల లో జన్మించిన ఆమె ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 విజేత. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
2021లో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించింది. 2022లో రవితేజ సరసన ఖిలాడీ చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వగా, అదే ఏడాది అడివి శేష్ సరసన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది.
2023లో తమిళంలో కొలై చేసింది. 2024లో మహేష్ బాబు గుంటూరు కారం, లక్కీ బాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ లాంటి చిత్రాల్లో నటించింది. వీటిలో లక్కీ బాస్కర్ సూపర్ హిట్ అయ్యింది. 2025 సంక్రాంతి బ్లాక్ బస్టర్ వస్ర్తం తో మరో హిట్ అందుకుంది.
తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీనాక్షి టాలీవుడ్‌లో టాప్ ప్లేస్ అందుకునే దిశగా దూసుకెళ్తోంది.