మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, నటన, స్టైల్ అన్ని కలిపి ఈ బ్యూటీ యంగ్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన మీనాక్షి, తర్వాత తెలుగులో “వాహనములు నిలపరాదు”తో భారీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్, నటనతో మంచి గుర్తింపు తీసుకుంది.

తర్వాత వరుసగా ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, మట్కా, మెకానీకి రాఖీ వంటి సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకుంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం లో వెంకటేష్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో మెప్పించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.

ఈ హిట్స్ సక్సెస్‌తో టాలీవుడ్‌లో తన స్థానం దృఢం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా మీద చాలా యాక్టివ్. తరచూ కొత్త కొత్త ఫోటోషూట్స్, గ్లామర్ లుక్స్ తో తన అభిమానులను ఉత్సాహపరిచేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్ లో అదరగొట్టింది. చిలిపి నవ్వుతో పాటు ఆ డ్రెస్ ఆమె అందాన్ని మరింత మెరుగుపరుస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ, యువతలో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చాయి. మీరు ఇంకా చూసి ఉంటారా? ఈ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలపై మీ అభిప్రాయాన్ని చెప్పండి!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *