హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా..మరో హీరోయిన్ క్యారెక్టర్ కోసం యంగ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ సరసన మీనాక్షి నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను రీసెంట్ గా ఉగాది రోజున అఫీషియల్ గౌ అనౌన్స్ చేశారు.

ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కాయి. ఇది హ్యాట్రిక్ సినిమా కానుంది. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించనున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ ఈసారి ఎక్సట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్ టైన్ మెంట్ తో వస్తున్నామంటూ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.