వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. జనవరి 14వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మీనాక్షి నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో ఆమె పాల్గొంది. ఈ క్రమంలో బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి పంచుకోమంటే బాలకృష్ణ గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Madhavilatha: మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు
‘’’ఆయన ఎప్పటికీ జై బాలయ్య నే.. ఆయన ఫుల్ ఎనర్జీ పర్శన్, ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం, ఆయన చాలా ఎనర్జిటిక్, చాలా యాక్టివ్. నాకు ఆయన అంటే చాలా గౌరవం ఎందుకంటే ఆయన మనుషుల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడో ఒక షోలో నేను ఆయనను కలిసి మా పర్సనల్ విషయాలు వెల్లడించాను వాటిని షో వరకే వదిలేయకుండా తరువాత మళ్లీ కలిసినప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అన్ స్టాపబుల్ సెట్ లో నేను ఆయన కుమార్తెలను కూడా కలిశాను. బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన వ్యక్తి . బాలకృష్ణలా ఇంకెవరూ ఉండలేరు. బాలకృష్ణ రియల్ ఓజి.. ఆయనలా ఇంకా ఎవరూ ఉండలేరు అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.