స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా, వెంకీతో ముచ్చటగా హ్యా్ట్రిక్ సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘గోదారి గట్టు’ సెన్సేషనల్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ పాట ప్రస్తుతం సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ అవుతోంది. అయితే, ఈ పాట చార్ట్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు ఈ మూవీలోని రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘మీను’ అనే మరో మెలోడీ సాంగ్‌ను రెండో సింగిల్ సాంగ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే, ఈ పాటను డిసెంబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఈ పాటలో విక్టరీ వెంకటేష్, అందాల భామ మీనాక్షి చౌదరిలపై చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రెజెంట్ చేస్తుండగా శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
You all loved the first single, #GodariGattu and made it a CHARTBUSTER MAGICAL MELODY OF THE SEASON ????
Now, get ready to celebrate another beautiful song from #SankranthikiVasthunam ????
Second Single #Meenu out on 19th December
— https://t.co/Cxw2gSi5Ls… pic.twitter.com/SvNCXsJ0g6
— Sri Venkateswara Creations (@SVC_official) December 17, 2024
The post మీను’ అంటూ మరో మెలోడీ పట్టుకొస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎప్పుడంటే? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.