లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ హవానే ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నడుస్తుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సాలిడ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయగా ఈ సినిమా మానియానే సోషల్ మీడియాని టేకోవర్ చేసేసింది.
అయితే అనౌన్సమెంట్ గా ఓ క్రేజీ పోస్టర్ ని మేకర్స్ తీసుకురాగా దీనితో అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యారు. రక్తంతో కనిపించిన ఈ పోస్టర్ చేతికి పూసలు దండలు కనిపించాయి. అయితే ఇది చాలా మంది దర్శకుడు చెయ్యి అనుకున్నారు. కానీ దీనిపై తాను అది నా చెయ్యి కాదు చిరంజీవి చెయ్యే అని తాను క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇపుడు మరో క్రేజీ పిక్ ని తాను రివీల్ చేసాడు. చిరుతో చేతిలో చెయ్యేసి ఇద్దరూ కలిసి ఒక బ్లడ్ ప్రామిస్ ని అందిస్తున్నారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో మరింత ఆనందం నెలకొంది.
Good morning.#ChiruOdelaCinema will be VEHEMENTLY VIOLENT.#FANBOYTHANDAVAM ???? pic.twitter.com/fKkqOBLmmm
— Srikanth Odela (@odela_srikanth) December 4, 2024
The post క్రేజీ పిక్: హైప్ పెంచేస్తున్న మెగాస్టార్, ఓదెల బ్లడ్ ప్రామిస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.