యంగ్ స్టార్స్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. తను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలాంటి ప్రోత్సాహమే కోరుకున్న చిరు..ఇప్పటి తరం హీరోలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త సినిమా భజే వాయు వేగం సినిమాకు కూడా తన బెస్ట్ విశెస్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా టీజర్ ను ఇవాళ మధ్యాహ్నం 2.25 నిమిషాలకు ఆయన రిలీజ్ చేయబోతున్నారు.

విశ్వంభర సెట్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో కార్తికేయ గుమ్మకొండ కలిశారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు మెగా బ్లెస్సింగ్ దక్కిందని పోస్ట్ చేశారు. భజే వాయు వేగం సినిమాను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.