రాచకొండ కమిషనర్ కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణాన్ని, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నా, నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు అని మోహన్ బాబు పేర్కొన్నారు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడని, మోహన్ బాబు పేర్కొన్నారు. ఇక మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడని కూడా మోహన్ బాబు పేర్కొన్నారు.
Manchu Family: మంచు ఫ్యామిలీ ‘డ్రామా’.. మనోజ్ ఫిర్యాదులో ట్విస్ట్!
మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారని అన్నారు. ఇక మనోజ్, మౌనిక నా ఇంటిని ఆక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారని అన్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నా, నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు అని అన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు, సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు అని అన్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని కాబట్టి మనోజ్, మౌనిక, అతని సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు వెల్లడించారు. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి అని మోహన్ బాబు పేర్కొన్నారు. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి అని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండని మోహన్ బాబు కోరారు.