నటుడు మోహన్ బాబు కి పోలీసులు షాక్ ఇచ్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు కి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జల్పల్లిలో జరిగిన ఘటనపై సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక జలపల్లి లో జరిగిన దాడి ఘటన పై రాచకొండ సిపి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు చెందిన లైసెన్స్ గనులను పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు మోహన్ బాబు, విష్ణు. వీరిద్దరి గన్ లైసెన్సులను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Mohan Babu: హాస్పిటల్ కు మోహన్ బాబు దంపతులు.. క్షమాపణలు చెప్పాలంటూ మీడియా ప్రతినిధుల ధర్నా!!!
మరోపక్క బీపీ పెరిగిపోయి కింద పడిపోయారు మోహన్ బాబు. అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను విష్ణు ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కి మంచు మోహన్ బాబు తో పాటు మంచు మోహన్ బాబు భార్యని కూడా తీసుకువెళ్లారు. మూడు రోజుల నుంచి జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో మోహన్ బాబు భార్య కూడా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరోపక్క మోహన్ బాబుని ఆయన భార్యని విష్ణు హాస్పిటల్ కి తీసుకువెళ్లిన క్రమంలో మోహన్ బాబు నివాసంలోనే మంచు మనోజ్ దంపతులు ఉన్నారు. దాదాపు మూడు నాలుగు గంటల నుంచి అక్కడే వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.