- మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట
- పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు
- మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి.
మంచు కుటుంబంలో మొదలైన వివాదంజుకో మలుపుతో సినిమా రేంజ్ యక్ష్ణన్ ని తలపిస్తుంది. నిన్న మోహన్ బాబు జర్నలిస్ట్ పై పై దాడి చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకు కారణమైంది. మోహన్ బాబు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. తన కి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేస్తూ మోహన్ బాబు పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని, తాను పోలీసులను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని మోహన్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటీషన్ దాఖలు చేసారు.
ఈ పిటిషన్ ను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.పోలీసుల ముందు విచారణకు హాజరుకాకుండా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. ఈ గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి. ప్రతి 2 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.