- ‘కోరికలే గుర్రాలైతే’ అంటూ
- మోహన్ బాబు సంచలన పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్.
Mohan Babu Korikale Gurralaithe: నేడు (డిసెంబర్ 8) ఉదయం నుండి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు ఉదయం పూట నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య గొడవలు జరిగాయని ఈ సందర్బంగా ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికి ఈ వార్తలు వాస్తవం కాదంటూ మంచు కుటుంబానికి సంబంధించిన పిఆర్వోలు సమాచారాన్ని అందించారు. ఇది ఇలా ఉండగా.. నటుడు మోహన్ బాబు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Also Read: Black magic: యూట్యూబ్‌లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
Korikale Gurralaithe(1979): Directed by my guru, the legendary Sri. Dasari Narayana Rao garu, and produced by Sri. G. Jagadeesh Chandra Prasad garu, this scene was a special milestone in my career. Sharing the screen with Sri. Chandramohan garu and Sri. Murali Mohan garu made it… pic.twitter.com/sIsJIDRW5C
— Mohan Babu M (@themohanbabu) December 8, 2024
మోహన్ బాబు చేసిన ట్వీట్ లో ఇదివరకు ఆయన నటించిన సినిమాలలోని కోరికలే గుర్రాలైతే సినిమాలోని ఓ క్లిప్ జత చేసి.. కోరికలే గుర్రాలైతే అంటూ ఓ ట్యాగ్ ను జత చేశారు. ఈ పోస్టులో ‘నా గురువు లెజెండ్రీ శ్రీ దాసరి నారాయణ రావు, నిర్మాత జగదీష్ చంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెరకెక్కిన ఈ సన్నివేశం నా కెరియర్ లో ఓ ప్రత్యేక మైలురాయి అంటూ చెప్పుకొచ్చాడు. చంద్రమోహన్, మురళీమోహన్ ఈ సన్నివేశం తనకు గుర్తుండిపోయేలా చేశారని ఆయన రాసుకోచ్చారు. అలాగే తాను సినిమాలలో మొదటిసారి యమధర్మరాజు పాత్ర చేయడం మర్చిపోలేదని అదొక మంచి అనుభూతి అంటూ రాసుకోవచ్చారు. ఆ సమయంలో ఆ సన్నివేశం సవాలుగా అనిపించిందని ఆ తర్వాత సంతోషాన్ని ఇచ్చిందంటూ తెలిపారు. మొత్తానికి ఈ సినిమా నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారిందని పోస్ట్ లో తెలిపారు.
Also Read: Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్