Mohan Babu Korikale Gurralaithe: ‘కోరికలే గుర్రాలైతే’ అంటూ మోహన్ బాబు సంచలన పోస్ట్

  • హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
  • పోలీసులు జారీ చేసిన నోటీసుని సవాలు చేసిన మోహన్ బాబు
  • తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్న కలెక్షన్ కింగ్

MohanBabu : జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు. దీంతో మనోజ్‌ అనుచరులను విష్ణు బౌన్సర్లు, అనుచరులు వారిని ఇంటి లోపలి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపద్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్‌బాబుకు పోలీసు శాఖ సూచించిన సంగతి తెలిసిందే.

Read Also:Google Search : ఇంటర్నేషనల్ లెవల్లో హవా చూపిస్తున్న పవన్ కళ్యాణ్

కాగా..నిన్న (మంగళవారం) సాయంత్రం పోలీస్ అధికారులతో కలిసి మంచు మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డీజీపీ ఆఫీస్‌లో అడిషనల్ డీజీపీతో భేటీ అయ్యారు. తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ 7 నెలల పాప లోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా జరుగుతుండగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు దాడికి దిగారు. మోహన్ బాబు ఏర్పాటు చేసుకొన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేశారు.

Read Also:Manchu Manoj: జల్‌పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన.. మద్దతు తెలిపిన మనోజ్

దీంతో ఆయా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై తాజాగా స్పందించిన రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై 118 బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *