Published on Oct 25, 2024 8:00 AM IST

యువ హీరో అక్షయ్ కుమార్ అలాగే ప్రేమలు ఫేమ్ మమిత బైజు అలాగే ఐశ్వర్య హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రమే “డియర్ కృష్ణ”. పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథను దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.

కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే భక్తులు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఓ మిరకల్ జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథ ఇతివృత్తమే డియర్ కృష్ణ సినిమా సబ్జెక్ట్. నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని స్క్రీన్ ప్లే రాసిన ఆ భగవంతుడు శ్రీ కృష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్ బలరామ్ పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ దివంగత గాయకులు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన చివరి పాట చిరుప్రాయం పాట లాలెట్టన్ మోహన్ లాల్ గారి చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా లాలెట్టన్ మోహన్ లాల్ గారు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు చేసిన ఒక మిరకిల్ పాయింట్ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ చిరుప్రాయం నా మనసును హత్తుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఈ పాట మీ హృదయాలను కూడా హత్తుకుంటుంది. ఈ పాటలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *