Published on Jan 3, 2025 1:55 AM IST
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’ న్యూ ఇయర్ కానుకగా తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
ఇక ఈ సినిమాకు తెలుగునాట కూడా అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతుండటంతో థియేటర్ల సంఖ్య పెంచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు ఈ సినిమాను జనవరి 3న మరో 55 అధిక స్క్రీన్లు జోడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
హనీఫ్ అదేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.