Published on Jan 3, 2025 4:00 PM IST
ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు శంకర్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో వస్తున్న సాలిడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. మరి ట్రైలర్ తర్వాత భారీ హైప్ అందుకున్న ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు ట్రైలర్ రెస్పాన్స్ తో ఖుషీగా గా ఉన్నారు. ఇలా మరింత ఎనర్జిటిక్ గా ప్రమోషన్స్ లో తాను పాల్గొంటుండగా లేటెస్ట్ తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాము ట్రైలర్ లో కొంచెం చూపించాం అని దర్శకుడు శంకర్ సినిమాలో ఇంకా కీలకమైన సీన్స్ అలాగే ఎన్నో అన్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ని సెట్ చేసారని అవన్నీ రేపు జనవరి 10న థియేటర్స్ లో ట్రీట్ ఇస్తారని దిల్ రాజు అంటున్నారు. దీనితో గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ రాబోతుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మొత్తం పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.