
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కేవలం గ్లామర్ వరకే పరిమితం కాదు. చదువులోనూ అత్యధికంగా రాణించిన పలువురు హీరోయిన్లు ఉన్నారు. వారిలో ముఖ్యంగా సాయి పల్లవి, రష్మిక మందన్న, ఐశ్వర్య లక్ష్మి చదువులోనూ మెరుగైన ప్రగతిని సాధించారు. ఈ తారల విద్యా వివరాలు ఎంతో మందికి తెలియకపోవచ్చు, కాబట్టి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
సాయి పల్లవి ప్రేమమ్ (Premam) సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిన ఆమె విద్యాపరంగా కూడా ఎంతో ముందుంది. కోయంబత్తూరులో పాఠశాల విద్యను పూర్తిచేసి, జార్జియాలోని Tbilisi State Medical University నుండి వైద్య విద్య పూర్తి చేసింది. డాక్టర్‌గా పనిచేయాలనుకున్నప్పటికీ, సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో నటన వైపు వచ్చింది.
రష్మిక మందన్న కెరీర్ మొదట నుంచీ అగ్రస్థాయిలో ఉంది. ఛలో (Chalo) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, పుష్ప (Pushpa) తో పాన్ ఇండియా స్టార్‌గా మారింది. చదువులోనూ రష్మిక దూసుకుపోయింది. బెంగళూరులోని MS Ramaiah College of Arts, Science & Commerce లో సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
ఇక తమిళ, మలయాళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆమె మెడిసిన్ విద్య చదివింది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చిన ఆమె పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ఆమె తెలుగు సినీ ప్రేమికులను కూడా పలకరించనుంది.