Movies Prabhas Missed, NTR Hit

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ హీరో చాలా సినిమాలను తిరస్కరించారట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో అశోక్ ఒకటి. అయితే ఈ సినిమాను ప్రభాస్ తిరస్కరించడంతో, ఎన్టీఆర్‌కు అవకాశం వచ్చి ఆయన చేశారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమన్నా హీరోయిన్‌గా నటించిన మూవీ ఊసరవెల్లి. ఈ స్టోరీని కూడా దర్శకుడు మొదట ప్రభాస్‌కు వినిపించాడట. ఆయన రిజెక్ట్ చేయడంతో ఆఫర్ తారక్‌కు వచ్చింది.

అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ జంటగా నటించిన సినిమాల్లో బృందావనం ఒకటి. ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కాగా, ఈ మూవీ కథ కూడా మొదటగా ప్రభాస్ వద్దకే వెళ్లిందంట. జూనియర్ ఎన్టీర్ సినీ కెరీర్ ఓ మలుపు తింపిన చిత్రాల్లో సింహాద్రి మూవీ ఒకటి. ఈ సినిమాతో తారక్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు.

అయితే ఈ సినిమా కథ కూడా మొదట ప్రభాస్ వద్దకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ కథనం ప్రభాస్ తిరస్కరించిన కొన్ని విజయవంతమైన చిత్రాల గురించి. వీటిలో అశోక్, ఊసరవెల్లి, బృందావనం మరియు సింహాద్రి వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *