Published on Dec 17, 2024 11:40 AM IST
మన టాలీవుడ్ లో తన మొదటి సినిమా తోనే మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కోసం తెలిసిందే. సీతారామం అలాగే హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తాను అందుకోగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో మాత్రం తన హిట్ స్ట్రీక్ కి బ్రేక్ పడింది. అయితే ఆ తర్వాత మళ్ళీ కల్కి 2898 ఎడి లో తెలుగులో కనిపించింది కానీ తెలుగులో హీరోయిన్ గా నెక్స్ట్ సినిమా ఏది అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
మరి ఎట్టకేలకు మళ్ళీ మృణాల్ తెలుగు సినిమాలో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ లో కనిపించేందుకు సిద్ధం అయ్యింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న “డెకాయిట్” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేశారు. తనపై ఒక ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ఈమె నుంచి ఉన్నట్టుగా రివీల్ చేశారు. మరి నేడు శేష్ బర్త్ డే కానుకగా వీటిని రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సినిమా రాబోతుంది.