‘ముఫాసా’ కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 17, 2024 2:59 AM IST

టాలీవుడ్‌లో స్టార్ హీరో చిత్రాలకు ప్రీమియర్ షోలు పడటం మనం చూశాం. చిన్న హీరోల సినిమాలకు కూడా ఈ మధ్య ప్రీమియర్స్ వేస్తున్నారు. అయితే, డబ్బింగ్ సినిమాలకు, యానిమేటెడ్ సినిమాలకు ప్రీమియర్స్ చాలా అరుదు. కానీ, ఇప్పుడు ఓ యానిమేటెడ్ సినిమాకు తెలుగులో ప్రీమియర్స్ పడుతుండటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వాల్ట్ డిస్నీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ముఫాసా – ది లయన్ కింగ్’కి ఇండియాలో మంచి క్రేజ్ నెలకొంది. ఈ సినిమాను పలు ఇండియన్ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘ముఫాసా’ చిత్రాన్ని డిసెంబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండగా.. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షో ఉదయం 8 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్‌కు డిమాండ్ కూడా భారీగా ఉందని అభిమానులు చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు వాయిస్ వినేందుకే ఈ సినిమాను చూడాలని కొందరు అభిమానులు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *