Music Director Thaman: ఏంటి తమన్ బ్రో.. సింగర్‌ను పుసుక్కున అలా అనేసావ్

  • సోషల్ మీడియాలో వైరల్
  • నోరుజారిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్
  • పుసుక్కున అలా అనేసావ్ అంటూ కామెంట్స్

Music Director Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడుగుతే చాలామంది ఇచ్చే సమాధానం ఎస్.ఎస్. తమన్ అని మాత్రమే సమాధానం వస్తుంది. తమన్ సంగీత దర్శకుడుగా పనిచేస్తూనే అప్పుడప్పుడు కొన్ని మ్యూజిక్ కాంపిటీషన్లలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అప్పుడప్పుడు తమన్ మాట్లాడే మాటలు కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాయి కూడా. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్ఎస్ తమన్ ఓ మహిళ గాయకురాలిని పొరపాటున అవమానిస్తూ మాట్లాడిన సంఘటన వైరల్ అవుతుంది. ఇకపోతే, ఎస్ఎస్ తమన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆ అమ్మాయి మొదటిసారి పాడుతుందని, ఆమెను చెప్పల్ తో ఆశీర్వదించండి అంటూ స్టేజి పైన తడబడ్డాడు. అయితే, మొదట తమన్ మాట్లాడిన మాటలకు అక్కడ ఉన్న ప్రజలు షాక్ అయ్యారు. అయితే, తన పొరపాటును వెంటనే గ్రహించిన తమన్ దాన్ని సరిదిద్దే క్రమం చేశాడు.

Also Read: ICC Banned NCL USA: కొరడా ఝుళిపించిన ఐసీసీ.. చిన్న పొరపాటుకు ఆ లీగ్‌పై నిషేధం

తాను తప్పుగా చెప్పానని, చెప్పల్ కాదని.. చప్పట్లతో ఆశీర్వదించండి అంటూ చెప్పుకొచ్చాడు. చప్పల్ అన్నందుకు బాధేసిందని.. స్టేజి మీద తన తప్పును ఒప్పుకున్నాడు తమన్. కాకపోతే, ఈ పొరపాటును సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ట్రోల్ల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ సభలో బాలకృష్ణ, తమన్ పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఒక సమయంలో బాలకృష్ణ పాటలకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంజాయ్ చేశారు. జై బాలయ్య.. జై జై బాలయ్య.. అంటున్న కూడా వారిద్దరూ ఎంజాయ్ చేస్తూ కనపడ్డారు. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఏంటి తమన్ బ్రో.. పొరపాటున ఇంతమాట అనేసావ్, తప్పు కదా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *