
‘సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీతంతో అద్భుత విజయాలు సాధిస్తూ, కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం OG సినిమా సహా పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే తమన్, తరచూ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంగేజ్ చేస్తారు. అయితే, తాజాగా ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసి అందరినీ కదిలించారు.
తమన్ “కళ్లల్లో నీళ్లు, మనసంతా ఆనందం.. ఇదే నిజమైన సంతోషం” అంటూ ఒక హృదయాన్ని హత్తుకునే వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వృద్ధుడు రోడ్డు పక్కన ఉన్న హోటల్ దగ్గర జండా ఊపుతూ కస్టమర్లను ఆహ్వానిస్తున్నాడు. తీవ్ర ఎండలో చెప్పులు లేకుండా, గొడుగు లేకుండా కష్టపడుతున్న ఆ వృద్ధుడిని ఓ యువకుడు చూసి ఆగాడు.
ఆ యువకుడు “ఎండలో ఇంతలా కష్టపడుతున్నావేంటి?” అని అడగ్గా, ఆ వృద్ధుడు “హోటల్ వాళ్లు గొడుగు కొంటామన్నారు, చెప్పులు అయితే రాత్రి కుక్కలు కొరికేశాయి” అని బాధపడ్డారు. వెంటనే స్పందించిన ఆ యువకుడు ఒక గొడుగు, కొత్త చెప్పులు, ఓ జ్యూస్ బాటిల్ తీసుకురాగా, ఆ వృద్ధుడు ఆయన చేతిని ముద్దాడుతూ అశీర్వదించాడు.
తమన్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియో అనేకమందికి మానవత్వం ఏంటో గుర్తు చేసింది. ఈ కథనం నెటిజన్లను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచిచూడండి!