Published on Nov 7, 2024 10:55 AM IST
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘మై హోమ్ గ్రూప్స్’ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వర్ రావు నేడు న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రామేశ్వర్ రావు ఆయన కుమారుడు, మై హోమ్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావుతో కలిసి ప్రధానిని కలిశారు.
ఈ సందర్భంగా వారు ఇరువురు ప్రధానిని శాలువాతో సత్కరించారు. ప్రధాని మోదీకి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మోదీతో కొంత సమయం గడిపారు. పలు విషయాలను మోదీతో వారు ముచ్చటించినట్లుగా తెలిపారు. దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీ చేస్తున్న కృషి అభినందనీయమని వారు ఈ సందర్భంగా అన్నారు.