ఐకానిక్ నవంబర్‌కు సిద్ధం కావాలంటున్న పుష్పరాజ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టాడు. ఇక ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

‘పుష్ప-2’ చిత్రాన్ని బుధవారం రాత్రి ప్రీమియర్స్ రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్స్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు క్యూ కట్టారు. అయితే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో అనుకోని విధంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయం గురించి తెలుసుకున్న చిత్ర యూనిట్, తాజాగా దీనిపై స్పందించింది.

ఎవరూ ఊహించని ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని.. గాయపడ్డ చిన్నారికి అండగా ఉంటామని ‘పుష్ప-2’ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా వెల్లడించింది. ఇలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

The post ‘పుష్ప-2’ ప్రీమియర్‌లో అపశృతి.. విచారం వ్యక్తం చేసిన మేకర్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *