ఫోటో మూమెంట్: కాబోయే భార్యతో నాగచైతన్య షికారు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 19, 2024 8:03 PM IST

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాల ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గతకొంత కాలంగా వీరిద్దరు రిలేషన్‌లో ఉండి, తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

అయితే, తాజాగా కాబోయే భార్య శోభితతో నాగచైతన్య చెట్టాపట్టాలేసుకుని షికారు చేస్తున్నాడు. తాజాగా ఓ లిఫ్ట్‌లో వీరిద్దరు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా చిల్ అవుతూ ఈ ఇద్దరు కలిసి ఇలా షికార్లు చేస్తుండటంతో అభిమానులు వీరి పెళ్లి కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *