Nagarjuna: ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్.. జోరు మీదున్న మన్మధుడు

ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫాలో అవ్వడమే కాదు.. సినీ రంగంలో ఛేంజెస్‌కు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. వరుసగా యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. రీసెంట్లీ మరో యంగ్ ఫిల్మ్ మేకర్‌కు ఓకే చెప్పారట కింగ్. దానికి తోడు తాజాగా శ్రీశైలంలో ఆయన సిక్స్ ప్యాక్ తో సందడి చేసాడు. యంగ్ హీరోలకైనా వయస్సు అయిపోతుందేమో కానీ.. సీనియర్ హీరో నాగార్జునకు మాత్రం ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఫుల్ ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ.. టాలీవుడ్ మన్మధుడిగా స్థిరపడిపోయారు కింగ్. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు.. ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులను ముందుగా క్యాచ్ చేసి అందుకు తగ్గట్లుగా సినిమాలు సెలక్టివ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ యంగ్ తరంగ్ హవా నడుస్తుండటంతో వారితో సినిమాలు చేస్తున్నారు నాగార్జున. ఈ ఏడాది నా సామి రంగాతో హిట్టుందుకున్న నాగ్.. వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

Earthquake: మహబూబ్‌నగర్‌లో మరోసారి కంపించిన భూమి..

కుమారులు నాగ చైతన్య, అఖిల్‌కు కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ఆయన సొంతం. టూ సన్స్ ఒక సినిమాను సెట్స్‌పై తీసుకు రావడానికి ఏడాదికి పైగా టైం తీసుకుంటుంటే.. నాగ్ మాత్రం మూడు నాలుగు చిత్రాలకు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, మధ్యలో టీవీ ఇండస్ట్రీని మడతపెట్టేస్తున్నారు కింగ్. శేఖర్ కమ్ముల లాంటి వర్సటైల్ డైరెక్టర్‌తో త్రిలింగ్వల్ మూవీ కుబేర చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరిలో ప్రేక్షకులను పలకరించబోతుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ లాంటి వైల్డ్ అండ్ యంగ్ డైరెక్టర్‌తో కూలీలో ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారు. దానికి తోడు నాగార్జున ఖాతాలోకి మరో యంగ్ డైరెక్టర్ చేరాడు. హుషారు, రౌడీ బాయ్స్, ఓం భీం బుష్‌ ఫేమ్ శ్రీ హర్షను లైన్లో పెట్టారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగ్‍కు శ్రీ హర్ష కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, సంక్రాంతికి మూవీ లాంచింగ్ ఉంటుందని గట్టి బజ్ వినిపిస్తోంది. ఇదే కాదు.. బాలీవుడ్ బ్రహ్మాస్త్ర 2 కూడా ఆయన రోల్ కంటిన్యూ కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రేజీ అండ్ బిగ్ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ చూపిస్తున్నారు మన్మధుడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *