
తండేల్ సినిమా విజయోత్సవం అక్కినేని ఫ్యాన్స్‌లో ఆనందం నింపుతోంది. జెట్ స్పీడ్లో వంద కోట్ల వైపు దూసుకెళ్తున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తోంది. ఈ విజయంపై కింగ్ నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు నాగ చైతన్య నటన, అభిరుచి, కృషి, కలలు కనే ధైర్యం గురించిప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన చైతూ.. నిన్ను కొడుకుగా చూసి గర్విస్తున్నా. తండేల్ ఒక సినిమా మాత్రమే కాదు, నీ కష్టపాటు, అభిరుచికి నిదర్శనం’’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఈ సినిమా విజయం అక్కినేని అభిమానులందరికీ చెందుతుందని నాగ్ తెలిపారు. అక్కినేని ఫ్యాన్స్ ఓ కుటుంబంలా అండగా నిలబడ్డారని కొనియాడారు. తండేల్ విజయం అభిమానుల ప్రేమ, మద్దతుకు సంకేతం అని పేర్కొన్నారు. అలాగే సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
సాయి పల్లవి అద్భుతమైన నటన నాగార్జునను ఆశ్చర్యపరిచిందని, ఆమె అద్భుతమైన టాలెంట్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, ఇతర తండేల్ టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సినిమా విజయాన్ని మర్చిపోలేని క్షణంగా అభివర్ణించారు.
తండేల్ సినిమా కేవలం ఒక విజయమైన కాదు, అక్కినేని వారసుడిగా చైతూ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం. ఈ విజయంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.