ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమా నుంచి నాగార్జున క్యారెక్టర్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముంబై ధారావి నేపథ్యంలో సాగే మాఫియా స్టోరితో కుబేర తెరకెక్కుతోందట.Kubera | నా ఫస్ట్ లుక్‌ ముందే చూడాలనుకుంటున్నారా..? అక్కినేని నాగార్జున  కుబేర అప్‌డేట్‌-Namasthe Telangana

ఈ సినిమా నుంచి నాగార్జున క్యారెక్టర్ లుక్ ను ఈరోజు సాయంత్రం 7.15 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో రివీల్ చేయబోతున్నారు. కుబేర సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కుబేర పై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.