Nagavamsi : బోని కపూర్ కు దిమ్మతిరిగేకౌంటర్ ఇచ్చిన నాగవంశీ

సూర్యదేవర నాగవంశీ తాను నిర్మించే సినిమాల ప్రమోషన్స్ లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం, దేవర రిలీజ్ టైమ్ లో నాగవంశీ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. సెటైరికల్ గా మాట్లాడడం నాగవంశీ స్టైల్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్‌లో సౌత్, నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సామవేశంలో బాలీవుడ్ నిర్మాతకు తన సెటైర్స్ తో కౌంటర్లు వేస్తూ సౌండ్ లేకుండా చేసాడు.

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో నాగవంశీ మాట్లాడుతూ ‘కొంచం హార్ష్ గా ఉన్న ఇది మీరు ఒప్పుకోవాల్సిన నిజం. మా సౌత్ ఇండియా వాళ్ళు బాలీవుడ్ వాళ్ళకు సినిమాలు ఎలా తీయాలో నేర్పిస్తున్నారు. మీరు ఇంకా బాంద్రా, జుహు దగ్గరే ఆగిపోయారు, కానీ మేము బాహుబలి, RRR, పుష్ప, కల్కి, యానిమల్ సినిమాలు తీసాం అని అన్నారు. అందుకు ఒప్పుకొని బోనీ కపూర్ ఇవి మేము ఎప్పుడో చేసాం అని సమాధానం ఇస్తే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, యానిమల్ ఇవన్నీ సౌత్ నుంచి వచ్చి హిందీ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి కదా అని కౌంటర్ వేసాడు నాగవంశీ.  కానీ గదర్ 2, పఠాన్, జవాన్ ను మర్చిపోయావ్ అని బోనీ అంటే జవాన్ సౌత్ వాడే తీసాడు అని మల్లి కౌంటర్ వేసాడు నాగవంశీ. అలాగే పుష్ప -2 హిందీలో ఒక్క రోజులో రూ. 86 కోట్లు కలెక్ట్ చేయునప్పుడు మీ ముంబై వాళ్ళకి నిద్ర పట్టి ఉండదు అని బోనీ కపూర్ కు నాగవంశీ వేసిన కౌంటర్ ఈ చిట్ చాట్ లోనే హైలెట్ అని చెప్పాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *