పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సంధ్య థియేటర్ ఘటన పై నమోదైన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించారు న్యాయవాదులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. మొత్తం మీద ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఉత్కంఠ తెరదించుతూ నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పు వెలువడించింది నాంపల్లి కోర్టు. తీర్పు నేపథ్యంలో టెన్షన్ కు గురైన అల్లు అర్జున్ అభిమానులు ఊపిరిపీల్చుచుకున్నారు.