‘అఖండ-2’తో బాలయ్య తాండవం షురూ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 16, 2024 10:36 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ఆయన NBK109 చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. మాస్ చిత్రాల దర్శుకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి.

ఇక ఈసారి వాటిని మించిన విజయాన్ని అందుకునేందుకు ‘అఖండ 2 – తాండవం’తో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. గతంలో ‘అఖండ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ రానుంది. ఇక మరోసారి ఈ సినిమాతో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపెట్టనున్నాడు.

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించనుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *