
నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ ప్రస్తుతం సీక్వెల్ సినిమాల మీదే దృష్టి పెట్టారు. ఈ ట్రెండ్‌ను బాలకృష్ణ నుంచి మోక్షజ్ఞ వరకూ అందరూ ఫాలో అవుతున్నారు. బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్ హిట్‌ను ఎంజాయ్ చేస్తూనే, అఖండ 2 కోసం బిజీగా ఉన్నారు. తొలిభాగం సెన్సేషనల్ హిట్ కావడంతో, సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఎన్టీఆర్ కూడా వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటూ హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టనున్నారు. అలాగే దేవర 2 కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సీక్వెల్ కోసం మేకర్స్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కల్యాణ్ రామ్ సైతం బింబిసార 2 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యాక్షన్ డ్రామా ఒకటి చేస్తూనే, త్వరలో బింబిసార 2 సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా బిగ్ బడ్జెట్‌లో ప్రీక్వెల్ కానుంది.
ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై బిగ్ అంచనాలు ఉన్నాయి. ఆయన ఆదిత్య 999 మ్యాక్స్ అనే సై-ఫై మూవీతో వెండితెరకి పరిచయం కానున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య క్లాసిక్ హిట్ ఆదిత్య 369కి ఇది సీక్వెల్ కావడంతో, అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మొత్తానికి నందమూరి హీరోలందరూ సీక్వెల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.