హీరో అల్లరి నరేష్ కొత్త సినిమా ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 3న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. చిలక ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. మల్లి అంకం దర్శకత్వం వహించారు. పెళ్లి కాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటిస్తున్న ఆ ఒక్కటీ అడక్కు సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ థియేటర్స్ లోకి వస్తోంది.

తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అల్లరి నరేష్ కు కొన్నాళ్లు కామెడీ సినిమాలు ఆపమని సలహా ఇచ్చానని అయితే అది తప్పని ఆ ఒక్కటీ అడక్కు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందని నాని చెప్పాడు. అల్లరి నరేష్ సీరియస్ సబ్జెక్ట్ చేయడం వల్ల ఆయన కామెడీ ఎంజాయ్ చేయడాన్ని మిస్ అయ్యానని నాని చెప్పాడు. ఈవీవీ గారి సినిమా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని నాని కోరాడు.