Mon. Oct 13th, 2025
Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..

Nani – Sujeeth Movie: ప్రస్తుతం టాలీవుడ్‌కు డైరెక్టర్ సుజిత్ పీవర్ పట్టుకుంది. ఇటీవల ఈ స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్యాన్స్ ఆకలిని తీర్చేలా సినిమా రూపొందించారని సుజిత్‌పై పవన్ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా కూడా ఇదే జోష్‌లో ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ సుజిత్ నెక్ట్స్ ఎవరితో సినిమా తీస్తున్నారో తెలుసా.. నాచురల్ స్టార్ నానితో. సుజిత్ డైరెక్షన్‌లో నాని హీరోగా డీవీవీ దానయ్య ప్రొడక్షన్‌లో ఈ సినిమా రానుంది.

READ ALSO: CM Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ..

ముహూర్తం డేట్ ఫిక్స్..
దసరా పండగ సందర్భంగా సుజిత్ – నానిల కొత్త సినిమా పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానునందని టాక్. ఇప్పటికే వరుస సూపర్ హిట్ చిత్రాలతో తన కంటూ ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్న నాచురల్ స్టార్ నానిని సుజిత్ తన సినిమాలో ఎలా ప్రజెంట్ చేయబోతున్నారని సినిమా ప్రేమికులు, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఓజీ కాస్ట్ అండ్ క్రూ ఉండనుందని టాలీవుడ్‌ సర్కిల్స్‌లో టాక్ నడుస్తుంది. ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినహా, మిగితా టీం మొత్తం నాని – సుజిత్‌ల కొత్త సినిమాలో వర్క్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. రన్ రాజా రన్‌తో టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా సుజిత్ పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆయన తన రెండో సినిమాలోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేశారు. తన మూడో సినిమాలో తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో పట్టాలెక్కబొతున్న నాచురల్ స్టార్ నాని సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొట్టబోతుందో అంటూ ప్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఇది పక్కా యాక్షన్ సినిమా తెరకెక్కుతుంది.

READ ALSO: TCS Layoffs: టీసీఎస్‌లో భారీ కుదుపు.. వేల లేఆఫ్స్‌పై రచ్చ!