Published on Dec 14, 2024 3:03 AM IST
హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు న్యాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రానున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 14న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో బచ్చల మల్లి కోసం దరణి వస్తున్నాడంటూ ఓ మాస్ పోస్టర్‌ని కూడా వారు రిలీజ్ చేశారు. నాని కెరీర్‌లో మాస్ పాత్ర దసరా చిత్రంలోని ధరణి అని చెప్పాలి. ఇప్పుడు అల్లరి నరేష్ కెరీర్‌లో బచ్చల మల్లి కూడా అలాంటి పాత్ర గా నిలిచిపోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ప్రొడ్యూస్ చేశారు.