నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.. వధువు ఎవరంటే? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్‌లో విలక్షణమైన సినిమాలు చేసే హీరోగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో గతకొన్నేళ్లుగా మంచి సినిమాలు చేస్తూ హిట్-ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇక రీసెంట్‌గా ‘ప్రతినిథి-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్, ఇప్పుడు ‘సుందరకాండ’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే, ఈ హీరోకి ఇప్పుడు తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 40 ఏళ్లకు నారా రోహిత్ ఓ ఇంటివాడు కానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా రోహిత్ నిశ్చితార్థ వేడుక ఈ నెల 13న జరగనుందని తెలుస్తోంది. అయితే, నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

కానీ, నారా రోహిత గతకొద్ది రోజులుగా ఓ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాడని.. ఆయన నటించిన ‘ప్రతినిథి-2’ చిత్రంలోనూ ఆమె నటించిందని.. ఇప్పుడు ఆమెతోనే ఆయన నిశ్చితార్థం జరగనుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో.. రోహిత్ నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.

The post నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.. వధువు ఎవరంటే? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *