విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శ్రుతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి తదితరులు
దర్శకుడు : రిషికేశ్వర్ యోగి
నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి
సంగీత దర్శకుడు : NYX లోపెజ్
సినిమాటోగ్రఫీ : ఫహద్ అబ్దుల్ మజీద్
ఎడిటర్ : రిషికేశ్వర్ యోగి
సంబంధిత లింక్స్: ట్రైలర్
విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన శివ కుమార్ రామచంద్రవరపు హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. ఈ చిత్రాన్ని మంచి బజ్‌తో ప్రమోట్ చేశారు మేకర్స్. ఇక నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
సత్య(శివ కుమార్ రామచంద్రవరపు) ఓ నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటాడు. అతడు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా అతడికి యాక్టింగ్ రాదంటూ రిజెక్ట్ చేస్తారు. దీంతో అతడి తండ్రి, స్నేహితుడు కూడా తనకు యాక్టింగ్ రాదని చెప్పడంతో ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. ఇలా కేరళలోని ఓ గ్రామానికి చేరుకున్న సత్యకి అక్కడ డి సల్మాన్(నితిన్ ప్రసన్న) పరిచయం అవుతాడు. సల్మాన్‌తో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది..? సత్యకి కేరళలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి..? అతడి జీవితంలోకి ఇంకా ఎవరెవరు వచ్చి వెళ్తారు..? చివరకు అతడు కోరుకున్నట్లుగా యాక్టర్‌గా మారుతాడా లేదా..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం కథ ఎమోషనల్ రైడ్‌గా ఆకట్టుకుంది. తన లక్ష్యం కోసం వెళ్లే హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది చక్కగా ప్రెజెంట్ చేశారు. ఇక సత్య పాత్రలో శివ కుమార్ రామచంద్రవరపు నటన ఆకట్టుకుంటుంది. అన్ని ఎమోషన్స్‌లో చక్కటి నటనతో ఇంప్రెస్ చేశాడు. డి సల్మాన్ పాత్రలో నితిన్ ప్రసన్న కూడా స్టేబుల్ నటనతో ఆకట్టుకుంటాడు.
వీరితో పాటు శ్రుతి జయన్ పాత్ర కూడా ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. వీరి ముగ్గురు మధ్య వచ్చే సీన్స్ అలరిస్తాయి. నితిన్ ప్రసన్న చేసే కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇలాంటి ఎండింగ్ చాలా రేర్‌గా కనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే స్లోగా సాగడం సినిమాకు డ్యామేజ్ చేసింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సీన్స్ సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఇంట్లోనుండి వెళ్లిపోయిన హీరో కేరళకు ఎందుకు వెళ్తాడనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. దీనికి సరైన సమాధానం సినిమా మొత్తం వెతికినా దొరకదు.
అటు సెకండాఫ్‌లోని స్క్రీన్ ప్లే ట్రాక్ తప్పినట్లుగా కొన్ని సీన్స్‌లో అనిపిస్తుంది. స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. కథను ఇంకాస్త ఎంగేజింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. కథలో విషయం ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మిస్‌ఫైర్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఫ్లాట్‌గా సాగే ఎమోషనల్ రైడ్‌గా మిగిలింది.
ఈ సినిమాకు మ్యూజిక్ కొంతమేర మైనస్‌గా నిలిచింది. ఒకట్రెండు పాటలు మినహా సంగీతం పెద్దగా ప్రభావం చూపదు. సినిమాలో కేరళ బ్యాక్‌డ్రాప్ ఉండటంతో కొన్ని సీన్స్ పూర్తిగా మలయాళ భాషలో వస్తాయి. ఇవి తెలుగు ఆడియెన్స్‌ని మెప్పించవు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు రిషికేశ్వర్ యోగి రాసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నేటివిటీకి దూరంగా కేరళ బ్యాక్‌డ్రాప్ తీసుకోవడం కొంతమేర వర్కవుట్ కాలేదని చెప్పాలి. అయితే, సినిమాలోని ఇంటెన్షన్ మాత్రం చాలా నిజాయతీగా ప్రెజెంట్ చేశారు. ఎడిటర్‌గానూ ఆయన కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్ NYX లోపెజ్ అందించిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. బీజీఎం పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం చాలా బాగుంది. కేరళలోని అందాలను చక్కగా చూపెట్టారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్‌గా ‘నటుడి బ్రతుకు నటన’ సినిమా ఎమోషనల్ రైడ్‌గా కొన్ని చోట్ల ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో స్క్రీన్ ప్లే స్లోగా సాగడంతో కొన్ని సీన్స్ మైనస్‌గా మారాయి. స్క్రిప్టులోని కొన్ని సీన్స్, స్క్రీన్‌ప్లై పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఇదొక మంచి సినిమాగా నిలిచేది. ఎలాంటి అంచనాలు లేకుండా ట్రావెల్, ఎమోషనల్ రైడ్స్ ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team