టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఫీల్ గుడ్ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చింది. శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేరళ నేపథ్యంలో సాగింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్, సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
రిషికేశ్వర్ యోగి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నటుడు అవ్వాలనే ఓ కుర్రాడు జీవితం విలువను ఎలాంటి పరిస్థితుల్లో తెలుసుకున్నాడు.. అనే కాన్సె్ప్ట్‌తో ఈ మూవీ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. నేడు(డిసెంబర్ 6) సర్‌ప్రైజింగ్‌గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్‌కి రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో శ్రుతి జయన్, ఐశ్వర్య అనిల్ హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్‌ని ఇస్తారో చూడాలి.
The post రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘నరుడి బ్రతుకు నటన’ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.