
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నయనతార, అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టుల్లో నటించిన ఆమె, ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతూనే సినీ ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. అయితే, ఒక హీరో రూ.100 కోట్లు ఆఫర్ చేసినా, ఆయనతో నటించడానికి నిరాకరించారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఆ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ స్టార్ యష్ సరసన ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్నారు. కియారా అద్వానీ, హుమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్‌లతో కలిసి నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ‘ది లెజెండ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన శరవణన్, తన తదుపరి సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్రయత్నించారు. అందుకోసం రూ.100 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ, నయనతార ఆ అవకాశం తృణీకరించారని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో ఊర్వశి రౌతేలా నటించనున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో దీపికా పదుకొణె, ఆలియా భట్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. అయితే, నయనతార రూ.100 కోట్లు ఆఫర్ చేసినా శరవణన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై నయనతార అధికారికంగా స్పందించకపోయినా, ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.